రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయంపై కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు లేఖ రాయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు లేఖ రాయాలని జలవనరుల శాఖ అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. కృష్ణా, గోదావరి నదులు యాజమాన్య బోర్డుల సమావేశాల్ని... వారం రోజుల కిందట హైదరాబాద్‌లో నిర్వహించారు. భేటీలో చర్చించిన అంశాలు, అక్కడి పరిణామాలను జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్, ఈఎన్‌సీ నారాయణరెడ్డి ముఖ్యమంత్రికి వివరించారు.
కృష్ణా ఎగువన ఆలమట్టి జలాశయం ఎత్తు పెంపు వల్ల మరో 100 టీఎంసీలను కర్ణాటకలో నిల్వచేసుకుంటారని.... అధికారులతో వ్యాఖ్యానించారు. ఇప్పటికే దిగువకు నీళ్లు రాని పరిస్థితి ఉందన్న సీఎం.... సీమ జిల్లాల్లో ప్రజలు తాగునీటికే ఇబ్బందులు పడుతున్నారన్నారు. అన్ని వివరాలు పొందుపరుస్తూ కేంద్ర మంత్రికి లేఖ రాయాలని సీఎం పేర్కొన్నారు.