ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పింఛన్ల పంపిణీపై ప్రభుత్వం కీలక నిర్ణయం

ఒకే కుటుంబంలో రెండు పింఛన్లు తీసుకుంటుంటే ఒక పింఛన్‌ను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 15లోగా క్షేత్రస్థాయిలో పరిశీలించి వాస్తవమైతే ఒక పింఛను రద్దు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

ap  government has decided to cancel one pension if two pensions are taken
ap government has decided to cancel one pension if two pensions are taken

By

Published : May 12, 2020, 7:52 AM IST

ఒక రేషన్‌ కార్డుకు ఒకటే పింఛన్‌ విధానాన్ని ప్రభుత్వం పక్కా అమలు చేయాలని నిర్ణయించింది. ఒకే కుటుంబంలో రెండు పింఛన్లు తీసుకుంటుంటే ఒక పింఛన్‌ను రద్దు చేయనుంది. దివ్యాంగ, కిడ్నీ వ్యాధిగ్రస్తుల(డయాలసిస్‌ రోగులు), డీఎమ్‌హెచ్‌వో(క్యాన్సర్‌, థలసీమియా, పక్షవాతం) పింఛన్లకు దీని నుంచి మినహాయింపు ఇచ్చింది. ఆధార్‌కార్డు, ప్రజాసాధికార సర్వే, నవశకం సర్వే ఆధారంగా రాష్ట్రంలో ఒకే రేషన్‌కార్డు మీద రెండు పింఛన్లు పొందుతున్న వారి వివరాలు ప్రభుత్వం ఇప్పటికే సేకరించింది. వాటిని పంచాయతీలు, వార్డులు వారీగా విభజించి పురపాలక కమిషనర్‌/ఎంపీడీవోలకు పంపింది.

ఈ నెల 15వ తేదీలోగా క్షేత్రస్థాయిలో పరిశీలించి వాస్తవమైతే ఒక పింఛను రద్దు చేయాలని సూచించింది. పరిశీలన బాధ్యతను వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులకు అప్పగించింది. ఈ మేరకు గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ(సెర్ప్‌) రాజబాబు ఆదేశాలు జారీ చేశారు.

ABOUT THE AUTHOR

...view details