ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాజధానిపై హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టులో సవాల్‌ చేసిన రాష్ట్ర ప్రభుత్వం - ఏపీ తాజా విశేషాలు

Capital
రాజధానిపై సుప్రీంకోర్టుకు ప్రభుత్వం

By

Published : Sep 17, 2022, 12:16 PM IST

Updated : Sep 17, 2022, 12:48 PM IST

12:12 September 17

3 రాజధానులపై హైకోర్టు ఆదేశాలను సవాల్‌ చేసిన రాష్ట్ర ప్రభుత్వం

రాష్ట్రానికి అమరావతే రాజధాని అని 6 నెలల్లో అభివృద్ధి పనులు చేపట్టాలన్న హైకోర్టు ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది. 3 రాజధానులు ఏర్పాటు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని అమరావతే రాజధాని అని హైకోర్టు ఇచ్చిన తీర్పును నిలిపివేయాలని విజ్ఞప్తి చేసింది. హైకోర్టు తీర్పు శాసన వ్యవస్థను నిర్వీర్యం చేయడమేనన్న రాష్ట్ర ప్రభుత్వం తీర్పుపై వెంటనే స్టే ఇవ్వాలని కోరింది. రాజధానిపై చట్టాలు చేసే అధికారం అసెంబ్లీకి లేదనడం సరికాదని సీఆర్డీఏ చట్టం ప్రకారమే చేయాలనడం అసెంబ్లీ అధికారాలను ప్రశ్నించడమేనని పిటిషన్‌లో పేర్కొంది. అభివృద్ధి వికేంద్రీకరణ కోసమే 3 రాజధానులు ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు పిటిషన్‌లో తెలిపింది. సీఆర్డీఏ ఒప్పందం ప్రకారం 6 నెలల్లో అమరావతిని అభివృద్ధి చేయాలని హైకోర్టు ఆదేశించిందని... అది రాష్ట్ర ప్రభుత్వానికి సాధ్యం కాదని సుప్రీంకోర్టుకు తెలిపింది.

ఇవీ చదవండి:

Last Updated : Sep 17, 2022, 12:48 PM IST

ABOUT THE AUTHOR

...view details