andhra pradesh loan: రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం రూ.2,500 కోట్ల మేర రుణం సమీకరించింది. రిజర్వు బ్యాంకు నిర్వహించిన సెక్యూరిటీల వేలంలో పాల్గొని ఈ మేరకు రుణాలు పొందింది. రాబోయే 20 ఏళ్ల కాలపరిమితితో రుణం తిరిగి చెల్లించేలా 7.22 శాతం వడ్డీ ధరతో రూ.1,000 కోట్లు తీసుకుంది. మరో వెయ్యి కోట్లు 18 ఏళ్ల కాలపరిమితికి 7.18 శాతం వడ్డీకి స్వీకరించింది. మరో రూ.500 కోట్లు 16 ఏళ్ల కాలపరిమితితో 7.24శాతం వడ్డీ చెల్లించేలా తీసుకుంది. గడిచిన 8 రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం మొత్తం మీద రూ.4,500 కోట్ల మేర రుణం తీసుకున్నట్లయింది.
andhra pradesh loan: మరో రూ.2,500 కోట్ల రుణం
andhra pradesh loan: రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం రూ.2,500 కోట్ల మేర రుణం సమీకరించింది. రిజర్వు బ్యాంకు నిర్వహించిన సెక్యూరిటీల వేలంలో పాల్గొని ఈ మేరకు రుణాలు పొందింది. రాబోయే 20 ఏళ్ల కాలపరిమితితో రుణం తిరిగి చెల్లించేలా 7.22 శాతం వడ్డీ ధరతో రూ.1,000 కోట్లు తీసుకుంది.
బహిరంగ మార్కెట్ రుణం కోసం చివరి మూడు నెలల్లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అనుమతులు ఇవ్వాల్సి ఉంది. ఇంతవరకు ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం సమీకరించిన రుణాల విషయంలో రాష్ట్ర ఆర్థిక అధికారులకు, కేంద్ర ఆర్థిక శాఖలోని వ్యయ విభాగం అధికారులకు మధ్య భిన్నాభిప్రాయాలు ఏర్పడ్డాయని తెలిసింది. ఈ నేపథ్యంలో జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలకు సంబంధించి రుణ మొత్తం పరిమితి ఖరారు కాలేదని సమాచారం. ఈ లోపు ప్రస్తుతం రూ.2,500 కోట్లు ఈ మంగళవారం సెక్యూరిటీల వేలంలో పాల్గొని రుణ సమీకరణకు కేంద్రం అనుమతి ఇచ్చినట్లు తెలిసింది. త్వరలోనే చివరి త్రైమాసికం రుణ పరిమితి ఖరారయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఇదీ చదవండి:TTD: తితిదే బోర్డులో నేరచరిత్ర ఉన్న వారి పేర్లను పేపర్లలో ప్రకటన ఇవ్వండి: హైకోర్టు