గ్రామ, వార్దు సచివాలయ సిబ్బంది కార్యాలయాల్లో నిర్దేశిత సమయంలో అందుబాటులో ఉండాలని ఆదేశిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. స్పందన కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చే అభ్యర్థనలు స్వీకరించేందుకు ప్రతీ రోజూ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉండాలని ఆదేశించింది. సచివాలయ ఉద్యోగులందరికీ రోజుకు రెండుసార్లు బయోమెట్రిక్ హాజరును తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు. ఏప్రిల్ నుంచి బయోమెట్రిక్ ఆధారంగానే జీతాల చెల్లింపు ఉంటుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
బయోమెట్రిక్ ఆధారంగానే గ్రామ, వార్దు సచివాలయ సిబ్బంది జీతాలు - ap gram, ward employees biometric latest news
గ్రామ, వార్దు సచివాలయ సిబ్బందికి బయోమెట్రిక్ హాజరును తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ నుంచి బయోమెట్రిక్ ఆధారంగానే జీతాల చెల్లింపు ఉంటుందని తెలిపింది.
![బయోమెట్రిక్ ఆధారంగానే గ్రామ, వార్దు సచివాలయ సిబ్బంది జీతాలు ap government on salaries to secretory employees](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10509535-927-10509535-1612517557723.jpg)
ap government on salaries to secretory employees