ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సైబర్‌ కియోస్క్‌లు వస్తున్నాయ్‌! - cyber cyber kiosk in ap

సైబర్​ నేరాలను కట్టడి చేయాడానికి రాష్ట్ర వ్యాప్తంగా కియోస్కులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలి దశలో దిశ పోలీసు స్టేషన్లు, ఆ తర్వాత బస్టాండ్లలో ఏర్పాటు చేయనున్నారు.

ap government going to arrange cyber kiosk
ap government going to arrange cyber kiosk

By

Published : Mar 4, 2021, 9:43 AM IST

మన సెల్‌ఫోన్‌కు వచ్చే ఏవేవో లింకులను మనకు తెలియకుండానే క్లిక్‌ చేసేస్తుంటాం.. వివిధ రకాల మోసపూరిత యాప్‌లను అసంకల్పితంగా డౌన్‌లోడ్‌ చేసేస్తుంటాం.. ఫలితంగా వాటి మాటున దాగున్న సైబర్‌ నేరాల ముప్పును తెలిసీ తెలియక ఆహ్వానిస్తుంటాం. ఎప్పుడో ఒకప్పుడు నేరం బారిన పడి బాధితులుగా మారిన తర్వాత ఈ సమస్య ఎక్కడ తలెత్తిందని గుర్తించే ప్రయత్నం చేస్తాం. అదే ఎప్పటికప్పుడు మన సెల్‌ఫోన్‌లోకి మాల్‌వేర్‌ ఏమైనా ప్రవేశించిందా? హ్యాక్‌ అయిందా? అనేది తెలుసుకుంటూ.. వాటిని తొలగించుకోగలిగితే చాలావరకూ సైబర్‌ నేరాల బారిన పడే అవకాశం తగ్గుతుందని ఏపీ పోలీసులు చెబుతున్నారు.

అందుకోసం త్వరలో రాష్ట్రవ్యాప్తంగా సైబర్‌ కియోస్కులను ఏర్పాటు చేయనున్నారు. వాటికి మన సెల్‌ఫోన్‌, పెన్‌డ్రైవ్‌, మెమరీ కార్డు, ఇతర డివైస్‌లను అమర్చితే చాలు.. నిమిషాల వ్యవధిలో అందులోని మాల్‌వేర్స్‌, సైబర్‌ నేరాల ముప్పు కలిగించే ఇతరత్రా హాని కారకాల్ని తొలగించి శుభ్రం చేస్తాయి.

తొలి దశలో రాష్ట్రంలోని అన్ని దిశ పోలీసు స్టేషన్లు, జిల్లా ఎస్పీ కార్యాలయాలు, రాష్ట్ర సచివాలయం, డీజీపీ కార్యాలయం తదితర ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు. ఒక్కోటి రూ.2 లక్షల విలువైన మొత్తం 50 కియోస్కులను ఈ నెల కొనుగోలు చేయనున్నారు. గుజరాత్‌లోని జాతీయ ఫోరెన్సిక్‌ సైన్సు విశ్వవిద్యాలయం ద్వారా వీటి కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా అనుమతిచ్చింది. రెండో దశలో బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, విద్యా సంస్థల ప్రాంగణాల్లో ఏర్పాటు చేయనున్నారు. ఇలా దశల వారీగా అన్ని చోట్లా వీటిని అందుబాటులో ఉంచాలనేది ప్రణాళిక. ‘దిశ’ పేరుతో ఈ కియోస్కులను నిర్వహించనున్నారు.

ఇదీ చదవండి:

'ఇంటి ఆకృతిపై అభ్యంతరం చెప్పం'

ABOUT THE AUTHOR

...view details