కొండపల్లి పురపాలిక ఛైర్మన్ ఎన్నిక(chairman of kondapalli municipality )పై ప్రభుత్వం అప్పీలు చేసింది. హైకోర్టు సింగిల్ జడ్జి ఉత్తర్వులపై డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది(ap high court on kondapalli municipality ). ఈ మేరకు అత్యవసరంగా విచారించాలని కోరుతూ పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. పిటిషన్ పై అత్యవసర విచారణకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నిరాకరించారు.
Kondapalli Municipality: కొండపల్లి పురపాలిక ఛైర్మన్ ఎన్నికపై ప్రభుత్వం అప్పీల్ - ap high court on kondapalli municipality
22:29 November 21
హైకోర్టు సింగిల్ జడ్జి ఉత్తర్వులపై అప్పీలు చేసిన ప్రభుత్వం
కేసు వివరాలు ఇలా..!
కొండపల్లి పురపాలిక ఛైర్మన్ ఎన్నికలో భాగంగా ఎక్స్‌అఫీషియో ఓటు వేసేందుకు తనను అనుమతించాలని కోరుతూ తెదేపా ఎంపీ కేశినేని నాని(mp kesineni nani) హైకోర్టును ఆశ్రయించారు. విచారించిన న్యాయస్థానం.. ఓటు వేసేందుకు ఎంపీకి అనుమతించింది. సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ.. ప్రభుత్వం అప్పీల్‌కు వెళ్లింది.
ఛైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ.. ఎందుకంటే..
కృష్ణా జిల్లాలోని కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక రసవత్తరంగా(Kondapalli Municipal Chairman election) మారుతోంది. సోమవారం ఎన్నిక జరగనుంది. ఈ మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 29 వార్డులున్నాయి. ఇటీవల జరిగిన నగరపంచాయతీ ఎన్నికల్లో తెదేపా, వైకాపా.. 14 వార్డుల చొప్పున గెలుపొందాయి. మిగిలిన స్థానంలో గెలిచిన స్వతంత్య్ర అభ్యర్థి.. తెదేపాకు మద్దతునివ్వడంతో.. ఆ పార్టీ సీట్ల సంఖ్య 15కు పెరిగింది. మరోవైపు స్థానిక ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఎక్స్ అఫీషియో ఓట్లు వినియోగించుకోనున్నారు. దీంతో.. తెదేపాకు 16, వైకాపాకు 15 సీట్లు దక్కే అవకాశం ఏర్పడింది. ఈ క్రమంలో.. ఛైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతోంది.
ఇదీ చదవండి