ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ఎత్తివేస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. హైకోర్టు ఆదేశాలపై స్టే ఇవ్వాలని కోరుతూ.. సర్వోన్నత న్యాయస్థానంలో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఇప్పటికే ఈ అంశంపై ఏబీ వెంకటేశ్వరరావు సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేశారు. వాదనలు వినకుండా ఎలాంటి ఆదేశాలు ఇవ్వొద్దని కోరారు.
ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం పిటిషన్ - ab venkateswararao news
ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం పిటిషన్
12:34 July 02
సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం
దేశ, రాష్ట్ర భద్రతా వ్యవహారాలను పక్కనబెట్టి దేశద్రోహానికి పాల్పడ్డారని పేర్కొంటూ.. రాష్ట్ర ప్రభుత్వం ఏబీ వెంకటేశ్వరరావును సర్వీసు నుంచి సస్పెండ్ చేసింది. దీనిపై ఆయన హైకోర్టును ఆశ్రయించగా.. ప్రభుత్వ ఉత్తర్వులను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. తాజాగా ఈ ఉత్తర్వులపై ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది.
ఇదీ చూడండి..
Last Updated : Jul 2, 2020, 1:19 PM IST