విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ వ్యవహారంలో రమేశ్ ఆస్పత్రి ఎండీ రమేశ్, నాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ ఎం. సీతారామ్మోహన్ రావులపై తదుపరి చర్యలు నిలిపివేయాలంటూ రాష్ట్ర హైకోర్టు ఆదేశాల్చిన విషయం తెలిసిందే. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తరపున గురువారం అడ్వొకేట్ ఆన్ రికార్డ్స్ నజ్కీ... స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు సీతారామ్మోహన్రావు ఈ అంశంపై కేవియట్ దాఖలు చేశారు.
స్వర్ణ ప్యాలెస్ ఘటన: సుప్రీంను ఆశ్రయించిన రాష్ట్ర ప్రభుత్వం - స్వర్ణ ప్యాలెస్ ఘటన
విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ గురువారం సుప్రీంలో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది.
swarna-palace-fire-accident