రాష్ట్రంలో వాహనాల రవాణా పన్నుల చెల్లింపు గడువును ప్రభుత్వం పెంచింది. మార్చి 31వ తేదీతో చెల్లింపు గడువు ముగుస్తుండగా జూన్ 30 వరకు పొడిగించింది. లాక్‌డౌన్ నేపథ్యంలో వాహనదారులకు కాస్త ఊరట కలిగించేందుకు సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. గడువు పెంపుపై రవాణా శాఖ అధికారులకు మంత్రి పేర్ని నాని ఆదేశాలు జారీ చేశారు. సీఎం జగన్ నిర్ణయం మేరకు గడువు పెంచుతూ అధికారులకు మంత్రి ఉత్తర్వులిచ్చారు.
వాహనాల రవాణా పన్నుల చెల్లింపు గడువు పెంపు - ఏపీలో వావానాల రవాణా పన్నులు గడువు పెంపు
వాహనాల రవాణా పన్నులు చెల్లింపునకు రాష్ట్ర ప్రభుత్వం గడువు పెంచింది. లాక్‌డౌన్ నేపథ్యంలో పన్ను చెల్లించేందుకు వాహనదారులకు కాస్త ఊరట ఇచ్చింది.

payment-of-vehicle-transport-taxes in ap