ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వేసవిలో అదనపు విద్యుత్ కొనుగోళ్లకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు - ap govt to purchase additional power

ap govt to purchase additional power: వేసవిలో అదనపు విద్యుత్ కొనుగోళ్లపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ మేరకు అదనపు విద్యుత్ కొనుగోళ్లు చేసుకునేలా డిస్కంలకు ఈఆర్సీ.. పచ్చజెండా ఊపింది. స్వల్పకాలిక పద్ధతిన అనుమతులు మంజూరు చేసింది.

ap government Exercise to purchase additional power
ap government Exercise to purchase additional power

By

Published : Feb 4, 2022, 10:09 PM IST

ap govt to purchase additional power: వేసవిలో అదనపు విద్యుత్ కొనుగోళ్లకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ మేరకు అదనపు విద్యుత్ కొనుగోళ్లు చేసుకునేలా డిస్కంలకు ఈఆర్సీ.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. స్వల్పకాలిక పద్ధతిన అనుమతులు మంజూరు చేసింది. ఈ నెల నుంచి మే 22 వరకు.. రోజుకు 400 మెగావాట్లు కొనుగోళ్లు చేసేలా వెసులుబాటు కల్పించింది. పీక్ అవర్స్‌లో మరో 950 మెగావాట్ల కొనుగోలు చేసే అవకాశం ఇచ్చింది.

అదనపు విద్యుత్ కొనుగోలుకు టెండర్ల దాఖలుకు డిస్కంల ప్రతిపాదనలు ఇవ్వగా.. ఇందుకు ఈఆర్సీ అంగీకారం తెలిపింది. బిడ్డింగ్ వివరాలు, ఎంత అదనపు విద్యుత్‌కు బిడ్ వేశారో తెలపాలని ఈఆర్సీ స్పష్టం చేసింది. ఇప్పటికే బిడ్డింగ్ వివరాలను ఎస్పీడీసీఎల్​.. ఈఆర్సీకి సమర్పించింది.

ABOUT THE AUTHOR

...view details