ACB Cases రాష్ట్రంలో తెదేపా హయాంలో ఉద్యోగులపై నమోదైన ఏసీబీ కేసులన్నింటినీ పునర్ సమీక్షించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం ఐదుగురు సభ్యులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని నియమించింది. ఆదాయాన్ని మించి ఆస్తులకు సంబంధించి కొందరు ఉద్యోగులపై కక్ష సాధింపులో భాగంగా గత ప్రభుత్వం ఏసీబీ కేసులు నమోదు చేసిందంటూ వచ్చిన విజ్ఞప్తుల మేరకు… ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. కమిటీలో సభ్యులుగా పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, హోం శాఖ ముఖ్య కార్యదర్శి, న్యాయ శాఖ కార్యదర్శి, సంబంధిత శాఖలకు చెందిన కార్యదర్శులతో ...కమిటీని ఏర్పాటు చేశారు. మెంబర్ కన్వీనరుగా సాధారణ పరిపాలన శాఖ సర్వీసెస్ ముఖ్య కార్యదర్శి వ్యవహరించనున్నారు. ట్రాప్ కేసులు మినహా మిగిలిన కేసులను హైపవర్ కమిటీ సమీక్ష చేయనుంది.
ఉద్యోగులపై నమోదైన ఏసీబీ కేసులను సమీక్షించాలని ప్రభుత్వం నిర్ణయం - అనిశాపై ఏపీ సర్కార్ ఉత్తర్వులు
ACB Cases గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులపై నమోదైన ఏసీబీ కేసు ల సమీక్షకు హైపవర్ కమిటీని నియమిస్తు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆదాయాన్ని మించి ఆస్తులు కలిగిన 480 కేసులను పరిశీలించి కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది.
acb
Last Updated : Sep 30, 2022, 9:52 AM IST