ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఆత్మహత్య చేసుకున్న భవన నిర్మాణ కార్మికులకు ప్రభుత్వ పరిహారం - sucides for sand issue

ఆత్మహత్యకు పాల్పడ్డ భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించనుంది. ఒక్కొక్క కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున ఇవ్వనుంది.

ఆత్మహత్య చేసుకున్న భవన నిర్మాణ కార్మికులకు ప్రభుత్వ పరిహారం

By

Published : Nov 7, 2019, 2:05 PM IST

రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలకు ఆర్థిక సాయం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కొక్క కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని సీఎం ఆదేశించారని... కార్మిక శాఖ కమిషనర్ రేఖారాణి చెప్పారు. బలవన్మరణానికి పాల్పడిన వారిలో పోలేపల్లి వెంకటేశ్వరరావు, పడతపు వెంకట్రావు, చింతం బ్రహ్మాజీ, పటాస్ నాగుల్ మీరా, గుర్రం నాగరాజు ఉన్నారన్నారు. వారి నామినీలకు పరిహారం అందించినట్లు కమిషనర్ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details