రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ రాజ్యాంగ వ్యవస్థలను దిగజార్చేలా వ్యవహరిస్తున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. వ్యవస్థలను, వ్యక్తులను కించపరిచే ఉద్దేశం వైకాపాకు లేదన్నారు. ఎన్నికలంటే తమకు భయం లేదన్న ఆయన...కరోనా తగ్గకుండా ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. అలాగే చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడిగా ఉండటం రాష్ట్ర ప్రజల దురదృష్టం అని శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో ప్రస్తుత గందరగోళానికి చంద్రబాబు స్వార్థమే కారణమని ఆరోపించారు.
'రాజ్యాంగ వ్యవస్థలను దిగజార్చేలా ఎస్ఈసీ వ్యవహరిస్తున్నారు' - SEC ramesh kumar NEWS
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్‌పై ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి విమర్శలు చేశారు. రాజ్యాంగ వ్యవస్థలను దిగజార్చేలా ఎస్ఈసీ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మరోవైపు పోలవరం నిర్మాణంలో గందరగోళానికి చంద్రబాబే కారణమని అన్నారు.
srikanth reddy