ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో 35% సీట్లను ఇంజినీరింగ్, వ్యవసాయం, ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఈఏపీసెట్) ద్వారా భర్తీ చేసేందుకు ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. కన్వీనర్ కోటా కింద 35% సీట్లను కేటాయించేలా ప్రైవేటు విశ్వవిద్యాలయాల చట్టానికి సవరణ చేశారు. ఆర్డినెన్స్‌ను ఏపీ గెజిట్‌లో ప్రచురించేందుకు న్యాయశాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. విద్యార్థుల ప్రతిభ ఆధారంగా కౌన్సెలింగ్‌లో ఈ సీట్లను కేటాయిస్తారు.
ఇప్పటివరకూ ప్రైవేటు వర్సిటీలు తమ సొంత ప్రవేశపరీక్షలో ప్రతిభ ఆధారంగా, స్పాట్ కింద సీట్లు కేటాయిస్తున్నాయి. ఇక నుంచి కన్వీనర్ కోటాలోకి వెళ్లే 35% సీట్లకు ఉన్నతవిద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ బోధన రుసుములను ఖరారు చేస్తుంది. రాష్ట్రంలో మొత్తం 8 ప్రైవేటు విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. వీటిల్లో 8వేల వరకు ఇంజినీరింగ్ సీట్లు ఉన్నాయి. క్రియా, వెల్‌టెక్, సవిత వర్సిటీల్లో బీటెక్ లేదు.
కమిషన్ పరిధిలోకి..: