ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 24, 2020, 4:59 AM IST

ETV Bharat / city

కరోనా ఎఫెక్ట్​.. జిల్లాకో కాల్​ సెంటర్​ ఏర్పాటు

కరోనా వ్యాప్తి నివారణకు ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా జిల్లాకు ఒకటి చొప్పున కాల్​ సెంటర్లు ఏర్పాటు చేసింది. దీనితో పాటు రాష్ట్ర స్థాయిలో మరో కాల్​ సెంటర్​ను కేటాయించింది. ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చే వారి పర్యవేక్షణకు ప్రతి 10 మందికీ ఓ అధికారిని నియమించింది. ప్రస్తుత పరిస్థితి, తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా కలెక్టర్లకు మార్గదర్శకాలు జారీ చేసింది.

కరోనా ఎఫెక్ట్​.. జిల్లాకో కాల్​ సెంటర్​ ఏర్పాటు
కరోనా ఎఫెక్ట్​.. జిల్లాకో కాల్​ సెంటర్​ ఏర్పాటు

విదేశాల నుంచి వచ్చిన వారి ఆరోగ్య పరిస్థితి, పూర్తి పర్యవేక్షణ కోసం ప్రభుత్వం ప్రతి 10 మందికీ ఒక అధికారిని నియమించింది. వారి ఆరోగ్య వివరాలపై రోజూ వివరాలను నమోదు చేసి వాటి ఆధారంగా వైద్య, ఆరోగ్యశాఖ చర్యలు తీసుకోనుంది. రాష్ట్రంలో కరోనా నివారణ చర్యలపై విజయవాడలోని ఆరోగ్య విశ్వవిద్యాలయంలో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. మండల స్థాయిలో కొద్ది మందిని కొవిడ్​ - 19 ప్రత్యేక అధికారులుగా నియమించారు. ప్రస్తుత పరిస్థితి, తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా కలెక్టర్లకు మార్గదర్శకాలు జారీ చేశారు.

24 గంటలూ పనిచేసేలా కాల్​సెంటర్లు

కరోనా నివారణ చర్యల్లో భాగంగా ప్రభుత్వం 24 గంటలూ పనిచేసేలా కాల్​ సెంటర్లను ఏర్పాటు చేసింది. జిల్లాకొకటి చొప్పున ఏర్పాటు చేయడం సహా రాష్ట్ర స్థాయిలో మరో కాల్​ సెంటర్​ను కేటాయించింది. ప్రజలకు అవసరమైన ఆరోగ్య సలహాలను ఇచ్చేందుకు వీటిని ఏర్పాటు చేసింది. రాష్ట్ర స్థాయి కాల్​ సెంటర్​ నెంబరు 0866 - 2410978 అని అధికారులు తెలిపారు.

జిల్లా నెంబరు
శ్రీకాకుళం 6300073203
విజయనగరం

08922-227950,

9494914971

విశాఖపట్నం 9666556597 తూర్పుగోదావరి 8841361763 పశ్చిమగోదావరి 08812-222376 కృష్ణా 9491058200 గుంటూరు 0863-2271492 ప్రకాశం 7729803162 నెల్లూరు 9618232115 చిత్తూరు 9849902379 కడప 08562-245259 అనంతపురం 08554-277434 కర్నూలు 9441300005

ఇదీ చూడండి:

కరోనా అలర్ట్... ఏపీలో మరో పాజిటివ్ కేసు నమోదు

ABOUT THE AUTHOR

...view details