ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 28, 2020, 5:18 PM IST

Updated : Dec 28, 2020, 5:42 PM IST

ETV Bharat / city

రైతులకు ఇన్​పుట్ సబ్సిడీ చెల్లింపునకు ప్రభుత్వం అనుమతి

నివర్ తుపాన్ బాధిత రైతులకు ఇన్​పుట్ సబ్సిడీ చెల్లింపులపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నిధుల విడుదలకు అనుమతులు జారీ చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలను వ్యవసాయశాఖ వెల్లడించింది. బాధిత రైతుల ఖాతాల్లో నేరుగా నిధులు జమ చేయాలని ఆదేశించింది.

ap government
ap government

నివర్ తుపాను బాధిత రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ విడుదలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ.601.66 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ చెల్లింపునకు అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీకాకుళం మినహా అన్ని జిల్లాల్లో పంటలు దెబ్బతిన్నాయని పేర్కొంది. రాష్ట్రంలోని 7.82 లక్షల మంది రైతులు నష్టపోయినట్లు వెల్లడించింది. మొత్తం 4.59 లక్షల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయని వ్యవసాయశాఖ వివరించింది.

ఉద్యాన పంటల రైతులకు రూ.44.33 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ చెల్లింపునకు అనుమతులు ఇచ్చింది. తుపాను వల్ల 26,731 హెక్టార్లలో ఉద్యాన పంటలకు నష్టం జరిగిందని తెలిపింది. బాధిత రైతుల ఖాతాల్లో నేరుగా నిధులను జమ చేయాలని ఆదేశించింది.

Last Updated : Dec 28, 2020, 5:42 PM IST

ABOUT THE AUTHOR

...view details