విశాఖ గ్యాస్ లీకేజీ దుర్ఘటనపై విచారణకు ప్రభుత్వం ఉన్నతస్థాయి కమిటీ నియమించింది. అటవీ, పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఛైర్మన్‌గా వ్యవహరించనుండగా.. పరిశ్రమలశాఖ ముఖ్యకార్యదర్శి కరికాల వళవన్, విశాఖ కలెక్టర్ వినయ్‌చంద్, పోలీసు కమిషనర్ ఆర్.కె.మీనా, కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి వివేక్ యాదవ్ కమిటీ సభ్యులుగా ఉంటారు. ఘటనపై దర్యాప్తు జరిపి నెల రోజుల్లోగా నివేదిక సమర్పించాలని ఉన్నతస్థాయి కమిటీని ప్రభుత్వం ఆదేశించింది. ఇలాంటి ప్రమాదాలు మళ్లీ జరగకుండా తీసుకోవాల్సిన చర్యలు సూచించాలని పేర్కొంది. పరిశ్రమల్లో భద్రతా చర్యలకు సంబంధించి ప్రామాణిక విధానం రూపొందించాలని పేర్కొంది.
విశాఖ గ్యాస్ లీకేజీ ఘటనపై ఉన్నతస్థాయి కమిటీ నియామకం - high level committe appointed for investigating visakha gas incident
విశాఖలో గ్యాస్ లీక్ ఘటనపై ప్రభుత్వం ఉన్నతస్థాయి కమిటీని నియమించింది. పూర్తి విచారణ చేసి నివేదిక ఇవ్వాలంది. కమిటీ ఛైర్మన్‌గా ఐఏఎస్ అధికారి నీరబ్‌కుమార్ ప్రసాద్ వ్యవహరిస్తారు. నిన్నటి ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు.
విశాఖ గ్యాస్ లీకేజీ ఘటనపై ఉన్నతస్థాయి కమిటీ నియామకం