ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Old Age Pensions Hike in AP: జనవరి 1 నుంచి వృద్ధాప్య పింఛను పెంపు - OTS in AP

cm jagan
cm jagan

By

Published : Dec 14, 2021, 3:16 PM IST

Updated : Dec 15, 2021, 4:51 AM IST

14:58 December 14

వృద్ధాప్య పింఛను రూ.2,500కు పెంచిన ప్రభుత్వం

Old Age Pensions Hike in AP: ‘రాష్ట్రంలో జనవరి నుంచి వృద్ధాప్య పింఛన్లను రూ.2,250 నుంచి రూ.2,500కు పెంచుతున్నాం. జనవరి 1న ఆ మొత్తం చెల్లిస్తాం. రైతుభరోసా మూడోవిడత నిధులు జనవరిలోనే చెల్లిస్తాం. ఈబీసీ నేస్తం కింద జనవరి 9న చెల్లింపులు ఉంటాయి. అగ్రవర్ణ నిరుపేద మహిళలకు ఏడాదికి రూ.15వేల చొప్పున మూడేళ్లు ఇస్తాం. ఈ ఏడాది వివిధ పథకాల కింద మిగిలిపోయిన లబ్ధిదారులకు డిసెంబరు 28న ప్రయోజనాలు పంపిణీ చేస్తాం’ అని సీఎం జగన్‌ వెల్లడించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి మంగళవారం ఆయన కలెక్టర్లతో స్పందనపై సమీక్షిస్తూ ఈ కార్యక్రమం మరింత మెరుగుపడాలన్నారు. ‘ఒకే అర్జీ రెండోసారి వస్తే దాన్ని మరింత లోతుగా పరిశీలించాలి.తొలిసారి చూసినవారి కంటే పై అధికారి దాన్ని పరిశీలించాలి. అర్జీల పరిష్కారంలో నాణ్యత ముఖ్యం’ అన్నారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు- ఓటీఎస్‌ పథకంలో రూ.10వేల కోట్ల భారీ బకాయిని ప్రభుత్వం మాఫీచేస్తోంది. ఆస్తిపై పూర్తిహక్కులు కల్పిస్తోంది. రూ.5-10 లక్షల ధర ఉన్నవాటినీ ఉచితంగా రిజిస్ట్రేషన్‌ చేస్తున్నాం. ప్రజలకు దీనిద్వారా రూ.6,000 కోట్ల లబ్ధి కల్పిస్తున్నాం. గత ప్రభుత్వాలు వడ్డీ కూడా మాఫీ చేయకపోయినా ఆ నాయకులు దీన్ని విమర్శిస్తున్నారు’ అని జగన్‌ అన్నారు.

ఆయన ఇంకా ఏమన్నారంటే...

*కొవిడ్‌లో కొత్త రకం ఒమిక్రాన్‌కు వేగంగా వ్యాపించే లక్షణం ఉంది. విదేశాల నుంచి వచ్చేవారిని పరీక్షించాలి. కొవిడ్‌ రికవరీ రేటు రాష్ట్రంలో 99.21% (దేశంలో 98.36%) మరణాల రేటు 0.7% (దేశంలో 1.37%)గా ఉంది.
*నెలాఖరులోగా ఒక డోసు టీకాలు వందశాతం పూర్తికావాలి. నెల్లూరు జిల్లాలో ఇప్పటికే పూర్తయింది. తూర్పుగోదావరి, శ్రీకాకుళం, చిత్తూరు, విశాఖపట్నం కలెక్టర్లు టీకాలపై దృష్టిపెట్టాలి. డోసుల మధ్య కాలపరిమితి తగ్గించడంపైనా కేంద్ర అధికారులతో మాట్లాడాలి. 104 కాల్‌సెంటర్‌కు ఫోన్‌ రాగానే స్పందించాలి.
*100 పడకల కన్నా ఎక్కువ ఉన్న ఆస్పత్రులు పీఎస్‌ఏ ఆక్సిజన్‌ ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవాలని చెప్పాం. కలెక్టర్లు దీన్ని పర్యవేక్షించాలి. రాష్ట్ర ప్రభుత్వం 144 పీఎస్‌ఏ ఆక్సిజన్‌ ప్లాంట్లు ఏర్పాటు చేస్తోంది. ఈ స్థాయిలో మరే రాష్ట్రంలోనూ ఏర్పాటు చేయలేదు. కొవిడ్‌ సన్నద్ధతపైనా కలెక్టర్లు దృష్టిసారించాలి.
*ఇళ్ల నిర్మాణానికి హైకోర్టులో అడ్డంకులు తొలగిపోవడంతో ఆర్థికవ్యవస్థ పుంజుకుంటుంది. సిమెంటు, స్టీలు, ఇతర కొనుగోళ్లు పెరుగుతాయి. స్థానికంగా ఉపాధి లభిస్తుంది.
*జనవరి 31 కల్లా అన్ని ఇళ్ల నిర్మాణం ప్రారంభమయ్యేలా చూడాలి. నిర్మాణ ఖర్చు తగ్గాలి. సమీపంలోనే ఇటుకల తయారీ ఉండాలి.
*గృహనిర్మాణ లబ్ధిదారులకు పావలా వడ్డీకే రూ.35వేల రుణం ఇచ్చేలా కలెక్టర్లు బ్యాంకర్లతో మాట్లాడాలి. ఇసుకను అందుబాటులోకి తీసుకురావాలి.
*ధాన్యం కొనుగోళ్లను ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకోవాలి. రైతుల నుంచి నిరంతరం సమాచారం సేకరించాలి. మిల్లర్ల పాత్ర లేకుండా, రైతులకు మద్దతు ధర అందేలా చూడాలి. రైతుల పేర్ల నమోదుతో పని అయిపోయిందని అనుకోకూడదు. రోజువారీ కొనుగోళ్లపై సమీక్షించాలి.
*సచివాలయాలు, ఆర్‌బీకేలు, హెల్త్‌ క్లినిక్‌ల నిర్మాణం ఉగాది నాటికి పూర్తి కావాలి. డిజిటల్‌ లైబ్రరీలు అందుబాటులోకి తీసుకురావాలి.

ఇదీ చదవండి:

Flight Diverted: ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య.. దారి మళ్లింపు..

Last Updated : Dec 15, 2021, 4:51 AM IST

ABOUT THE AUTHOR

...view details