రాష్ట్రంలో ఆర్థికంగా ఇబ్బందులు పడుతోన్న సహకార చక్కెర కర్మాగారాలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయాన్ని విడుదల చేసింది. 5 కర్మాగారాలకు 54.60 కోట్లు విడుదల చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. చెరకు రైతులకు కర్మాగారాలు బకాయిలు చెల్లించేందుకు వీలుగా సహాయాన్ని చేసింది. ఈనెల 3న సహకార చక్కెర కర్మాగారాల పరిస్ధితిపై సమీక్షించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిధుల విడుదల చేయాలని ఆదేశించారు.
రైతు దినోత్సవం సందర్భంగా బుధవారం రైతులకు బకాయిలన్నింటినీ చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు. శ్రీ విజయరామ గజపతి ఫ్యాక్టరీ పరిధిలో 8.41 కోట్లు, చోడవరం షుగర్ ఫ్యాక్టరీ పరిధిలో 22.12 కోట్లు, ఏటికొప్పాక షుగర్ ఫ్యాక్టరీ కి 10.56 కోట్లు, తాండవ షుగర్ ఫ్యాక్టరీ పరిధిలో 8.88 కోట్లు, అనకాపల్లి షుగర్ ఫ్యాక్టరీ రైతులకు 4.63 కోట్ల బకాయిలు చెల్లించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.