ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ఆహార శుద్ధి పరిశ్రమల ఏర్పాటు, అభివృద్ధికి ప్రోత్సాహకాలు' - food processing industries incentives news in ap

రాష్ట్రంలో ఆహార శుద్ధి పరిశ్రమల అభివృద్ధికి ప్రోత్సాహకాలు ఇవ్వాలని ఉన్నత స్థాయి కమిటీ భేటీలో మంత్రులు బొత్స, బుగ్గన, కన్నబాబు నిర్ణయించారు. ఫుడ్​ ప్రాసెసింగ్​ జోన్స్​ ఏర్పాటుకు నివేదిక తయారు చేయాలని మంత్రులు అధికారులను ఆదేశించారు.

'ఆహార శుద్ధి పరిశ్రమల ఏర్పాటు, అభివృద్ధికి ప్రోత్సాహకాలు'
'ఆహార శుద్ధి పరిశ్రమల ఏర్పాటు, అభివృద్ధికి ప్రోత్సాహకాలు'

By

Published : Jun 4, 2020, 6:36 PM IST

రాష్ట్రంలో చిన్న, మధ్యతరహా ఆహార శుద్ధి పరిశ్రమల ఏర్పాటు, అభివృద్ధికి ప్రోత్సాహకాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆహార శుద్ధి పరిశ్రమల అభివృద్ధిపై ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీ భేటీలో మంత్రులు బుగ్గన, బొత్స సత్యనారాయణ, కన్నబాబు.. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశానికి ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

రాష్ట్రంలో అన్ని స్థాయిల్లో ఫుడ్​ ప్రాసెసింగ్​, అగ్రి పరిశ్రమల వివరాలు సేకరించాలని మంత్రులు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్స్ ఏర్పాటుకు నివేదిక తయారు చేయాలని నిర్దేశించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details