అగ్రిగోల్డ్ పిటిషన్లపై త్వరగా విచారణ జరపాలని తెలంగాణ హైకోర్టును ఏపీ ప్రభుత్వం కోరింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలంగాణ హైకోర్టుకు ఏపీ అడ్వొకేట్ జనరల్ ఏజీ శ్రీరాం విజ్ఞప్తి చేశారు. అనుమతిస్తే బాధితులకు సొమ్ము చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. పిటిషన్లపై విచారణ జరపాలని అగ్రిగోల్డ్ బాధితుల సంఘం తరఫు న్యాయవాది కోర్టుకు విజ్ఞప్తి చేశారు. సోమవారం విచారణ చేపడతామని తెలంగాణ హైకోర్టు తెలిపింది.
అగ్రిగోల్డ్ విచారణ త్వరగా తేల్చండి... తెలంగాణ హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి - అగ్రిగోల్డ్ వివాదంపై తాజా వార్తలు
అగ్రిగోల్డ్ పిటిషన్లపై తెలంగాణ హైకోర్టుకు రాష్ట్ర ప్రభత్వం విజ్ఞప్తి చేసింది. పిటిషన్లపై త్వరగా విచారణ జరపాలని కోరింది. అనుమతిస్తే బాధితులకు సొమ్ము చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.
అగ్రిగోల్డ్ పిటిషన్లపై తెలంగాణ హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి