ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

‘నరేగా’ పనిదినాల వినియోగంలో రాష్ట్రానికి అగ్రస్థానం - ఏపీలో ఉపాది హమీ అమలు తీరు

నరేగా పనిదినాల వినియోగంలో రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. ఈ మేరకు రాష్ట్ర గ్రామీణాభివృద్ధిశాఖ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ సంయుక్త కార్యదర్శి రోహిత్ కుమార్.. ప్రభుత్వాన్ని అభినందించారని అందులో పేర్కొంది.

ap got first place narega
ap got first place narega

By

Published : Jul 8, 2021, 10:54 AM IST

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా)లోని వివిధ అంశాల అమలులో రాష్ట్రం ఉత్తమ పని తీరు కనబరిచినందుకు కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ సంయుక్త కార్యదర్శి రోహిత్‌ కుమార్‌ అభినందించారని రాష్ట్ర గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్‌ కార్యాలయం బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో నరేగా పనితీరుపై వివిధ రాష్ట్రాల గ్రామీణాభివృద్ధిశాఖల అధికారులతో సంయుక్త కమిషనర్‌ దిల్లీ నుంచి నిర్వహించిన వీడియో సమావేశంలో పలు అంశాల్లో రాష్ట్రం పనితీరుపట్ల పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details