మాజీ మంత్రి అఖిలప్రియ మరికాసేపట్లో బెయిల్‌పై విడుదలై బయటకు రానున్నారు. చంచల్‌గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న అఖిలప్రియకు సికింద్రాబాద్ న్యాయస్థానం నిన్న బెయిల్ మంజూరు చేసింది. ఈనెల ఆరో తేదీ నుంచి చంచల్‌గూడ మహిళా జైల్లో అఖిలప్రియ రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
బోయిన్పల్లిలో ప్రవీణ్ సోదరుల అపహరణ కేసులో అఖిలప్రియ ప్రధాన నిందితురాలిగా ఉన్నారు. ఆమెను బోయిన్పల్లి పోలీసులు ఆరో తేదీ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అఖిలప్రియ బెయిల్ పై బయటకు రానుందని తెలుసుకున్న ఆమె అభిమానులు జైలు వద్దకు చేరుకుంటున్నారు. ఆళ్లగడ్డ కు చెందిన పలువురు నాయకులు కార్యకర్తలు జైలు ముందు వేచి చూస్తున్నారు.