చలో ఆత్మకూరు నిమిత్తం తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు తెదేపా శ్రేణులు ప్రత్యేక వాహనం కారవాన్‌ను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నుంచి రాష్ట్రానికి రప్పించే క్రమంలో పోలీసులు ఆ వాహనాన్ని చలో ఆత్మకూరు నిర్వహించిన రోజున ఉదయం స్వాధీనం చేసుకున్నారు. కొందరు పోలీసులు వాహనాన్ని అద్దంకి- నార్కెట్‌పల్లి ప్రధాన రహదారిలో వాడపల్లి వద్ద సరిహద్దు దాటించారు. మిర్యాలగూడ- నల్గొండ రహదారి మధ్యలో వాహనాన్ని ఆపి వెళ్లారు. వాహనం లోపలికి వెళ్లే తాళాలను వెంట తీసుకెళ్లగా, వాహనాన్ని నడిపే తాళాలను మాత్రమే డ్రైవర్‌కు ఇచ్చారు. అయోమయానికి గురైన డ్రైవర్ ఎన్టీఆర్ ట్రస్టుభవన్కు ఫోన్లో సమాచారమిచ్చారు. అక్కడి వారు తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి నెల్లూరి దుర్గాప్రసాద్‌కు విషయాన్ని తెలిపారు. వాహనాన్ని ఆయన మిర్యాలగూడలోని తన సొంత ఇంటివద్దకు తీసుకొచ్చారు. బుధవారం రాత్రి హైదరాబాద్‌కు పంపారు.
తెలంగాణ సరిహద్దుల్లో చంద్రబాబు కారవాన్! - chandrababu naidu caravan identified
తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు కారవాన్‌ను రాష్ట్ర పోలీసులు తెలంగాణ సరిహద్దుల్లో వదిలేశారు. అనంతరం తెదేపా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి నెల్లూరి దుర్గాప్రసాద్ వాహనాన్ని గుర్తించి హైదారాబాద్‌కు తరలించారు.
'చంద్రబాబు కేరవాన్ ఆచూకి లభ్యం'