చినజీయర్ స్వామి చేపట్టిన ప్రజా ఉద్యమంలో తానూ పాలుపంచుకుంటానని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. తెలంగాణలోని హైదరాబాద్ నగర శివారు శంషాబాద్ మండలం ముచ్చింతలలో ఐదోరోజూ నిర్వహించిన చినజీయర్ స్వామి పుట్టినరోజు వేడుకల్లో చంద్రబాబు పాల్గొన్నారు. చినజీయర్ స్వామి చేసిన మంగళ శాసనాలను ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఉపయోగించుకోవాలని చంద్రబాబు కోరారు. పెదజీయర్ స్వామి చేపట్టిన ఉద్యమం తమిళనాడులో ఇప్పటికీ కొనసాగుతోందని గుర్తు చేశారు.
"చినజీయర్ స్వామి ప్రజా ఉద్యమం ఆదర్శనీయం" - ముచ్చింతల
తెలంగాణలోని హైదరాబాద్ నగర శివారు ముచ్చింతలలో చినజీయర్ స్వామి పుట్టినరోజు వేడుకలు ఐదోరోజు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో తెదేపా అధినేత చంద్రబాబు పాల్గొన్నారు.
వేడుకల్లో తెదేపా అధినేత చంద్రబాబు