రాష్ట్ర మత్స్యకారులు వైకాపా ఎంపీలతో... విదేశాంగ మంత్రిని దిల్లీలో కలిశారు. ఎంపీలు విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి, అవినాష్‌రెడ్డి, బెల్లాన చంద్రశేఖర్ వీరిని విదేశాంగ మంత్రి దగ్గరకు తీసుకెళ్లారు. రెండేళ్ల కిందట విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన మత్స్యకారులు 30మందిని పాక్, బంగ్లాదేశ్‌లు బందీలుగా పట్టుకున్నాయి. తమ కుటుంబసభ్యులను వెంటనే విడుదల చేసేలా... చర్యలు తీసుకోవాలని మత్స్యకారులు మంత్రి జయశంకర్‌ను కోరారు.
విదేశాంగ శాఖ మంత్రిని కలిసిన ఏపీ మత్స్యకారులు - విదేశాంగ మంత్రి జయశంకర్
పాకిస్థాన్, బంగ్లాదేశ్ దేశాల్లో బందీలుగా ఉన్న తమవారిని విడిపించాలని కోరుతూ... రాష్ట్ర మత్స్యకారులు వైకాపా ఎంపీల సాయంతో దిల్లీలో విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్‌ను కలిసి విన్నవించారు.
విదేశాంగ మంత్రిని కలసిన ఏపీ మత్స్యకారులు
TAGGED:
విదేశాంగ మంత్రి జయశంకర్