ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

108 టీఎంసీలు నీరు కేటాయించాలని కృష్ణా బోర్డుకు లేఖ - కృష్ణా బోర్డుకు ఏపీ ఈఎన్​సీ లేఖ వార్తలు

తాగు, సాగు నీటి అవసరాల మేరకు 108 టీఎంసీల నీటిని రాష్ట్రానికి కేటాయించాలని కోరుతూ... కృష్ణా యాజమాన్య బోర్డును ఆంధ్రప్రదేశ్ కోరింది. ఈ మేరకు ఏపీ జలవనరుల శాఖ ఈఎన్​సీ బోర్డుకు లేఖ రాశారు.

krisha river board
108 టీఎంసీలు నీరు కేటాయించాలని కృష్ణా బోర్డుకు లేఖ

By

Published : Jan 7, 2021, 1:51 PM IST

మార్చి నెలాఖరు వరకు తాగు, సాగునీటి అవసరాల కోసం 108 టీఎంసీలు కేటాయించాలని కృష్ణానది యాజమాన్య బోర్డును రాష్ట్రం కోరింది. త్వరలో త్రిసభ్య కమిటీ సమావేశం జరగనున్న నేపథ్యంలో... నీటి అవసరాల వివరాలను ఎనిమిదో తేదీ లోపు పంపాలని బోర్డు ఇప్పటికే రెండు రాష్ట్రాలను కోరింది. ఇందుకు సంబంధించిన వివరాలను పంపుతూ.. ఏపీ జలవనరుల శాఖ ఈఎన్​సీ నారాయణరెడ్డి బోర్డు సభ్యకార్యదర్శికి లేఖ రాశారు.

వరద సమయంలో మళ్లించిన నీటితో సహా 2020 డిసెంబర్​ నెలాఖరు వరకు 359 టీఎంసీల నీటిని వినియోగించుకున్నట్లు తెలిపారు. మార్చి నెలాఖరు వరకు తాగు, సాగునీటి అవసరాల వివరాలను సమర్పించారు. సాగర్ కుడి కాలువ నుంచి 60, ఎడమ కాలువ నుంచి 14.60 టీఎంసీలు కావాలని పేర్కొన్నారు. పోతిరెడ్డిపాడు నుంచి 9.30, హంద్రీనీవా, ముచ్చుమర్రి ఎత్తిపోతల ద్వారా 24.98 టీఎంసీలు ఇవ్వాలన్నారు. మెుత్తంగా 108.50 టీఎంసీలు అవసరం అవుతాయని బోర్డుకు స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details