ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

AP Employees Union on PRC: 'అయోమయం చేయకండి.. పీఆర్సీపై స్పష్టమైన ప్రకటన ఇవ్వండి' - ఏపీలో పీఆర్సీ వివాదం

పీఆర్సీపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. ఆస్కార్​రావు(AP Employees Union Secretary Askar Rao On PRC ) డిమాండ్ చేశారు. ఉద్యోగ సంఘాల పరస్పర విరుద్ధమైన ప్రకటనలతో తమ సంఘానికి సంబంధం లేదన్నారు. పీఆర్సీపై(PRC issue in andhrapradesh) సీఎం తేల్చేస్తారని ఓ సంఘం నాయకుడు చేసిన ప్రకటనపై తమకు నమ్మకం లేదన్నారు.

AP Employees Union on PRC
AP Employees Union on PRC

By

Published : Nov 28, 2021, 4:42 PM IST

ప్రస్తుత ఉద్యోగ సంఘాల పరస్పర విరుద్ధమైన ప్రకటనలతో తమ సంఘానికి సంబంధం లేదని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. ఆస్కార్ రావు(AP Employees Union Secretary Askar Rao On PRC ) స్పష్టం చేశారు. ఇది ప్రభుత్వ క్రీడలో భాగమేనని, పీఆర్సీ పై ముఖ్యమంత్రి తేల్చేస్తారన్న ఒక సంఘం నాయకుని ప్రకటనపై ఉద్యోగులకు నమ్మకం లేదన్నారు.

ముందుగా ప్రకటించినట్టుగానే ప్రభుత్వానికి ఈ డిసెంబర్ 31 వరకు సమయం ఇస్తున్నామని, ఆ తరువాత ప్రణాళికాబద్ధంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఒక సారి బరిలోకి దిగితే వెనుదిరిగేది లేదని ఆస్కార్ రావు తెల్చిచెప్పారు.

ఏప్రిల్ 2021 లో కమిషనర్ అషుతోష్ మిశ్రా ఇచ్చిన రిపోర్ట్ పై అధ్యయనానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన, సలహాదారు అజేయ కల్లంతో సహా ఆరు గురితో వేసిన కమిటీ ఏమైందని..? ప్రశ్నించారు. ప్రభుత్వం ఇకనైనా నోరుతెరిచి ఉద్యోగుల్లో అయోమయాన్ని పోగొట్టాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details