పీఆర్సీతో పాటు ఫిట్‌మెంట్‌పై ప్రభుత్వం వెల్లడించిన వివరాలపై ఉద్యోగ సంఘాలు స్పందించాయి. కేంద్ర ప్రభుత్వ స్కేల్స్ అమలుకు తాము వ్యతిరేకమని ఏపీ ఎన్జీవోల సంఘ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు అన్నారు. తమ సమస్యలు సీఎం వద్ద మాత్రమే పరిష్కారం అవుతాయని భావిస్తున్నామని చెప్పారు. పీఆర్‌సీ నివేదిక ముఖ్యాంశాలను వెబ్‌సైట్‌లో పెట్టినందుకు కృతజ్ఞతలు తెలిపారు. న్యాయమైన తమ డిమాండ్లు అన్నీ పరిష్కరిస్తారని ఆశిస్తున్నామని అభిప్రాయపడ్డారు. ఉన్నతాధికారుల కమిటీ సిఫారసులపై మరింత చర్చించాలన్న ఆయన.. ప్రభుత్వానికి సహకరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
మా ఉద్యమం ఎవరికీ వ్యతిరేకం కాదు - బొప్పరాజు
కమిటీ సిఫారసులు వెబ్‌సైట్‌లో పెట్టినందుకు ధన్యవాదాలు. కమిటీ సిఫారసుల వల్ల మాకొచ్చే ఫిట్‌మెంట్ ఏమీ లేదు. మేం చేసే ఉద్యమం ఎవరికీ వ్యతిరేకం కాదు. మా ఉద్యమం ఇంకా ముందుకు వెళ్లకముందే సీఎం పరిష్కరించాలి. 70 డిమాండ్లు పరిష్కరించే వరకు ఉద్యమ కార్యాచరణ కొనసాగుతుంది -ఏపీ జేఏసీ ఛైర్మన్ బొప్పరాజు
ఆ పీఆర్సీ ఇవ్వడం సరికాదు - వెంకట్రామిరెడ్డి
కేంద్రం అమలుచేసే పీఆర్‌సీ తమకు ఇవ్వడం సరికాదని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి అన్నారు. కేంద్ర ఉద్యోగుల స్కేళ్లకు, తమ స్కేళ్లకు తేడా ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఫిట్‌మెంట్ పెంచాలని సీఎం జగన్‌ను కోరతామన్నారు.
సీఎం దగ్గరే తేల్చుకుంటాం - సూర్యనారాయణ
వేతన సవరణపై కమిటీ సిఫారసులు సరిగా లేవు. కేంద్ర పీఆర్‌సీపై లాభనష్టాలు బేరీజు వేసుకోవాల్సి ఉంది. మిటీ చెప్పిన ఫిట్‌మెంట్ మాకు ఆమోదయోగ్యం కాదు. మా ఫిట్‌మెంట్ అంశం సీఎం దగ్గరే తేల్చుకుంటాం - ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ
72 గంటల్లో నిర్ణయం - సీఎస్
CS Sameer Sharma On PRC: పీఆర్‌సీపై కమిటీ నివేదికను సీఎంకు అందించామని సీఎస్ సమీర్ శర్మ వెల్లడించారు. పీఆర్‌సీపై ముఖ్యమంత్రి మూడు రోజుల్లోనే నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన నివేదికను వెబ్‌సైట్‌లో ఉంచుతామన్నారు. ఫిట్‌మెంట్‌పై సీఎంకు 11 ప్రతిపాదనలు ఇచ్చామన్న సీఎస్.. ఇతర రాష్ట్రాలు ఇచ్చిన ఫిట్‌మెంట్‌ను పరిశీలించామని చెప్పారు. పీఆర్‌సీ, ఫిట్‌మెంట్ అంశాలపై సుదీర్ఘంగా చర్చించామని పేర్కొన్నారు. పీఆర్‌సీ అమలుతో రూ.8 వేల నుంచి 10 వేల కోట్ల అదనపు భారం పడనుందని వివరించారు.
ఇదీ చదవండి:
CS Sameer Sharma On PRC: పీఆర్‌సీపై 3 రోజుల్లోగా సీఎం జగన్ నిర్ణయం: సీఎస్ సమీర్‌శర్మ