ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

prc issue in social media: అన్నం లాక్కో.... ఉచిత బియ్యం ఇవ్వు

prc issue in social media: పీఆర్సీ వ్యవహారంలో ఉద్యోగులతో రాష్ట్ర ప్రభుత్వం తీరుపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత పీఆర్సీల్లో సాధించుకున్న వాటిని వైకాపా ప్రభుత్వం తొలగించేసింది. కొత్త పీఆర్సీలో కొత్త ప్రయోజనాల కోసం అడగాల్సిన పరిస్థితుల్లో పాత వాటి పునరుద్ధరణకే పోరాడాల్సిన పరిస్థితులను కల్పించింది.

prc issue in social media
prc issue in social media

By

Published : Feb 8, 2022, 6:59 AM IST

prc issue in social media: ‘ఒకడు కష్టపడి పనిచేసి తినడానికి చికెన్‌ బిర్యానీ తెచ్చుకుంటాడు. వాడి వద్ద చికెన్‌ ముక్క లాక్కుంటే అన్నంలో పప్పు కలిపి తింటాడు. పప్పును లాక్కుంటే చారుతో తింటాడు.

అన్నమే లాక్కుంటే... కంగారుగా అటు ఇటూ చూస్తాడు. అప్పుడు మనం ఉచిత బియ్యం ఇస్తామని చెబితే వాడే ఎగిరి గెంతేసి పనినీ, చికెన్‌ బిర్యానీని మరిచిపోయి బానిసలాగా పడి ఉంటాడు. అదీ మన పాలసీ...’

(లీడర్‌ అనే సినిమాలో సీఎం పాత్రధారి అయిన నటుడు రానాకు.. సీనియర్‌ ఎమ్మెల్యే పాత్రధారి అయిన గొల్లపూడి మారుతీరావు ఉపదేశించే రాజకీయ తంత్రమిది. పేదల్ని ఎలా దారికి తెచ్చుకోవాలో వివరిస్తూ చెప్పే మాటలివి)

ప్రస్తుతం పీఆర్సీ వ్యవహారంలోనూ ఉద్యోగులతో రాష్ట్ర ప్రభుత్వం అచ్చం ఇదే తరహాలో వ్యవహరించిందంటూ సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘‘గత పీఆర్సీల్లో సాధించుకున్న వాటిని వైకాపా ప్రభుత్వం తొలగించేసింది. కొత్త పీఆర్సీలో కొత్త ప్రయోజనాల కోసం అడగాల్సిన పరిస్థితుల్లో పాత వాటి పునరుద్ధరణకే పోరాడాల్సిన పరిస్థితులను కల్పించింది. తీరా ఉద్యమించాక... తొలగించిన వాటిలో కొన్నింటిని, కొద్దిమేరకే పునరుద్ధరించి మేలు చేశామని చెబుతోంది. సాధించాల్సినవి సాధించకపోగా.. ఇప్పటికే ఉన్నవి కోల్పోయినా సరే నాయకులు ప్రభుత్వాన్ని అభినందిస్తున్నారు. ఇదేం తీరు’’ అంటూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు సామాజిక మాధ్యమాల్లో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

ఇదీ చదవండి:

అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో ఘనంగా రథసప్తమి వేడుకలు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details