స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌పై ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య స్పందించింది. టీకాలు ఇచ్చేవరకు ఎన్నికల విధుల్లో పాల్గొనలేమని ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య ఛైర్మెన్ వెంకట్రామిరెడ్డి స్పష్టం చేశారు. విధులకు సమ్మతించే వారితో ఎన్నికలు జరుపుకోవచ్చని అన్నారు. ఎన్నికలు పెట్టాలనే పంతంతో ఎస్‌ఈసీ ఉన్నారని ఆయన ఆరోపించారు.
'విధులకు మేం హాజరుకాము.. వచ్చే వారితోనే చేయించుకోండి' - ఏపీ పంచాయతీ ఎన్నికల వివాదం తాజా వార్తలు
ap employees association on panchayath elections
12:30 January 23
స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌పై ఉద్యోగ సంఘాల స్పందన
'మా ప్రాణాలు రక్షించుకునే హక్కు మాకు ఉంది. ప్రాణాలు కాపాడుకునే హక్కు రాజ్యాంగం ఇచ్చింది. ప్రాణాపాయం వస్తే ఎదుటివాణ్ని చంపే హక్కూ ఉంది. మా హక్కును సుప్రీంకోర్టు కాదనదని భావిస్తున్నాం. టీకాలు అందే వరకూ ఎన్నికల విధుల్లో పాల్గొనలేం' -ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య ఛైర్మెన్ వెంకట్రామిరెడ్డి
ఇదీ చదవండి:
Last Updated : Jan 23, 2021, 2:53 PM IST