ఈ నెల 23 నుంచి ఏపీ ఎంసెట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు సాంకేతిక విద్యా ప్రత్యేక కమిషనర్ ఎం.ఎం.నాయక్ ప్రకటించారు. ఎంసెట్ 2020 కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్ విధానంలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులకు ఎంసెట్ ర్యాంకుల ఆధారంగా వెబ్ ఆప్షన్లు, సీట్ల కేటాయింపు తేదీలు త్వరలో ప్రకటిస్తామన్నారు.
ఏపీ ఎంసెట్ 2020 పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులు అధికారిక వెబ్సైట్ sche.ap.gov.in ద్వారా ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. ఎంసెట్లో అర్హత సాధించిన విద్యార్థులు (ఎంపీసీ స్ట్రీమ్) వెబ్ కౌన్సెలింగ్లో పాల్గొనవచ్చు. ఓసీ, బీసీ విద్యార్థులు రూ. 1,200, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.600 ఆన్లైన్ ప్రాసెసింగ్ ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. దీనిని http://apeamcet.nic.in ద్వారా చెల్లించవచ్చు.