ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అపోహలు వద్దు

సామూహిక ఓట్ల నమోదు, తొలగింపు చర్యలకు పాల్పడుతున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. సచివాలయం నుంచి 13 జిల్లాల కలెక్టర్లు, ఈఆర్​ఓలతో దూరదృశ్య సమీక్ష నిర్వహించారు.

అమరావతి సచివాలయంలో 13 జిల్లాల కలెక్టర్లు, ఈఆర్​ఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి.

By

Published : Mar 1, 2019, 6:35 AM IST

అమరావతి సచివాలయంలో 13 జిల్లాల కలెక్టర్లు, ఈఆర్​ఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి.

సామూహిక ఓట్ల నమోదు, తొలగింపు చర్యలకు పాల్పడుతున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది అన్నారు. అమరావతి సచివాలయం నుంచి 13 జిల్లాల కలెక్టర్లు, ఈఆర్​ఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఫారం-7 ద్వారా బీఎల్​ఓకు వచ్చిన ప్రతి దరఖాస్తును మూడు దశల్లో పరిశీలించి నిర్ధరణ చేసుకున్న తర్వాత మాత్రమే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎలాంటి అపోహలకు లోను కావద్దని ఓటర్లకు సూచించారు.
ఆయా వ్యక్తులకు తెలియకుండా వేల సంఖ్యలో ఆన్​లైన్ దరఖాస్తు చేస్తున్నారనేది ప్రధాన ఆరోపణగా ఉందని... అలాంటి వాటిని ఏ సిస్టం ద్వారా చేస్తున్నారో సాంకేతిక పరికజ్ఞానంతో గుర్తించే వీలుందన్నారు. సంబంధిత ఓటర్ల ఫిర్యాదులపై జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకుని...ఆ వ్యక్తులపై చర్యలు తీసుకోవాలన్నారు.ఇప్పటికే నియోజకవర్గ పరిధిలో అందిన ఫారం-6 దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించడం కోసం 24 x 7 పని గంటలు పనిచేయ్యాల్సి ఉందన్నారు. మార్చి 5నాటికి ఈఆర్ఓల వద్ద ఉన్న అన్ని దరఖాస్తులు పరిష్కరించాలని ద్వివేది ఆదేశించారు.

ABOUT THE AUTHOR

...view details