ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'రెండు దశల్లో ఎంపీటీసీ... జడ్పీటీసీ ఎన్నికలు' - ఏపీ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల న్యూస్

హైకోర్టు ఆదేశాలతో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ దిశగా మరో అడుగు పడింది. ఎన్నికల నిర్వహణకు సిద్ధం కావాలని అధికారులను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రమేశ్ కుమార్ ఆదేశించారు. మొత్తం రెండు దశల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ap election chief held a video conference with officials
ap election chief held a video conference with officials

By

Published : Jan 10, 2020, 4:55 PM IST

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై 13 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతోరాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిరమేశ్ కుమార్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అధికారులు సిద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి అధికారులు, సిబ్బందికి విధుల కేటాయింపు, ఎన్నికల సామగ్రి తరలింపు, పంపిణీకి సంబంధించి ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఎన్నికల నియమావళి అమలుతో పాటు హింసాత్మక ఘటనలకు తావులేకుండా చూడాలని ఎస్పీలకు సూచించారు. ఓటర్ల జాబితా విడుదల, పోలింగ్‌ బూత్‌ల గుర్తింపునకు సంబంధించిన వివరాలను నోటిఫికేషన్‌ ముందే సమర్పించాలని ఆదేశించారు.

రెండు దశల్లో ఎన్నికలు

మొత్తం రెండు దశల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు రమేశ్ కుమార్ పేర్కొన్నారు. తొలి దశలో 333 జడ్పీటీసీలు, 5,352 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాలని ప్రణాళిక రూపొందించారు. 17,494 పోలింగ్‌ కేంద్రాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. తొలి దశలో కోటీ 45 లక్షల మంది ఓటర్లు తమ హక్కు వినియోగించుకోనున్నారు. రెండో దశలో 327 జడ్పీటీసీలు, 4,960 ఎంపీటీసీలకు పోలింగ్‌ నిర్వహించనుండగా....16,831 పోలింగ్‌ కేంద్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ దశలో సుమారు కోటీ 36 లక్షల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. రెండు దశల్లోనూ 2 లక్షల 18వేల మంది సిబ్బంది విధుల్లో పాల్గొంటారని తెలిపారు.

ఇదీ చదవండి:

స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

ABOUT THE AUTHOR

...view details