రాష్ట్రంలో ఆంగ్ల మాధ్యమంపై దేశ వ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. బెంగళూరులో జరిగిన అంతర్జాతీయ సదస్సుకు హాజరైన ఆయన.. రాష్ట్రంలో చేపట్టిన విద్యా సంస్కరణలపై ప్రసంగించారు. ఆంగ్ల మాధ్యమంలో బోధించడం ద్వారా పేద విద్యార్థులకు సైతం దేశ విదేశాల్లో ఉన్నత ఉద్యోగావకాశాలు లభించేలా తీర్చిదిద్దుతున్నామని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన అమ్మ ఒడి పథకానికి ప్రశంసలు కురుస్తున్నాయని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కోసం చేపట్టిన నాడు - నేడు అమలు తీరును వివరించారు. ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో ఫీజుల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు.
'రాష్ట్రంలో ఆంగ్లమాధ్యమంపై దేశ వ్యాప్తంగా ప్రశంసలు' - ap education minister suresh on english medium in bengaluru seminar
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడంపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన విద్యా సంస్కరణలపై ప్రసంగించారు.
'రాష్ట్రంలో ఆంగ్లమాధ్యమంపై దేశ వ్యాప్తంగా ప్రశంసలు'