ఏపీ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఏపీ ఈఏపీసెట్-2021) ఫలితాలు విడుదలయ్యాయి. ఇప్పటికే ఇంజినీరింగ్ ఫలితాలను వెల్లడించగా.. తాజాగా అగ్రికల్చర్, ఫార్మసీ ఫలితాలను వెల్లడించారు. మంగళగిరిలోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ఈ ఫలితాలను విడుదల చేశారు. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల్లో ప్రవేశానికి 83,822 మంది విద్యార్థులు దరఖాస్తు చేయగా 78,066 మంది పరీక్షలకు హాజరయ్యారని తెలిపారు. ఫలితాల్లో 72,488 (92.85 శాతం) మంది ఉత్తీర్ణత సాధించినట్లు మంత్రి వివరించారు.
EAPCET: అగ్రికల్చర్, ఫార్మసీ ఫలితాలు విడుదల
ఈఏపీసెట్ ఫార్మసీ, వ్యవసాయ ఫలితాలను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేశారు. పరీక్షలకు 83,822మంది నమోదు చేసుకోగా, 78,066మంది పరీక్షకు హాజరయ్యారని, వారిలో 72488 (92.85శాతం) మంది ఉత్తీర్ణత సాధించారన్నారు.
ర్యాంకు కార్డులు వెబ్సైట్లో డౌన్‌లోడ్‌కు రేపటినుంచి అవకాశం కల్పించారు. తూర్పు గోదావరి జిల్లా కోరుకొండకు చెందిన చందం విష్ణు వివేక్‌కు మొదటి ర్యాంకు వచ్చింది. రెండవ ర్యాంకు అనంతపురానికి చెందిన ఆర్.శ్రీనివాస్ కార్తికేయ, మూడవర్యాంకును హన్మకొండకు చెందిన బొల్లినేని విశ్వాస్‌రావు, నాలుగవ ర్యాంకును కూకటపల్లికి చెందిన గజ్జల సమీహనరెడ్డి, ఐదవర్యాంకు హైదరాబాద్ ప్రగతినగర్‌కు చెందిన కాసా లహరి, ఆరవ ర్యాంకును గుంటూరుకు చెందిన కె.చైతన్యకృష్ణ, ఏడవర్యాంకును గోరంట్లకు చెందిన ఎన్.దివ్య, ఎనిమిదో ర్యాంకును సిద్దిపేటకుచెందిన కళ్యాణం రాహుల్ సిద్ధార్థ్, తొమ్మిదవర్యాంకును నల్గొండ గరిడేపల్లికిచెందిన టి.సాయిరెడ్డి, పదవ ర్యాంకును గుంటూరుకు చెందిన గద్దె విదిప్ కైవసం చేసుకున్నారని మంత్రి మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. మొదటి పదిర్యాంకుల్లో తెలంగాణ విద్యార్థులు ఐదు ర్యాంకు సాధించారని పేర్కొన్నారు.
- మొదటి ర్యాంకు-చందం విష్ణు వివేక్(కోరుకొండ-తూ.గో.)
- రెండో ర్యాంకు-శ్రీనివాస కార్తికేయ(అనంతపురం)
- మూడో ర్యాంకు-బొల్లినేని విశ్వాస్‌రావు(హనుమకొండ)
- నాలుగో ర్యాంకు-గజ్జల సమీహనరెడ్డి(రంగారెడ్డి)
- ఐదో ర్యాంకు-కాసా లహరి(హైదరాబాద్)
- ఆరో ర్యాంకు-కాశీందుల చైతన్యకృష్ణ(గుంటూరు)
- ఏడో ర్యాంకు-నూతలపాటి దివ్య(గుంటూరు)
- ఎనిమిదో ర్యాంకు-కల్యాణం రాహుల్ సిద్దార్థ్(సిద్దిపేట)
- తొమ్మిదో ర్యాంకు-తాడిసిన సాయిరెడ్డి(గరిడేపల్లి-నల్గొండ)
- పదో ర్యాంకు-గద్దె విడిప్(గుంటూరు)
ఇదీ చూడండి: పకడ్బందీగా సాగని జ్వరాల సర్వే.. అంతంత మాత్రంగానే దోమల నివారణ..