రాష్ట్ర వ్యాప్తంగా ఎంసెట్ ప్రారంభం.. 23 వరకు పరీక్షలు రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, బీ-ఫార్మసీ ప్రవేశాలకు నిర్వహిస్తున్న ఎంసెట్ ప్రారంభమైంది. కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరీక్ష నిర్వహణ కోసం విస్తృత ఏర్పాట్లు చేశారు. మొత్తం రెండు సెషన్లలో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇవాళ మొదలైన ఎంసెట్-2020 ఈ నెల 25 వరకు కొనసాగుతాయి. మొత్తం 14 సెషన్లలో ఏడు రోజుల పాటు సీబీటీ విధానంలో పరీక్షలు నిర్వహిస్తున్నారు.
ప్రతిరోజు ఉదయం 9నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 3నుంచి సాయంత్రం 6గంటల వరకు ఈ పరీక్ష జరుగుతుంది. ఇవాల్టి నుంచి ఈనెల 23 వరకు.... ఇంజినీరింగ్, ఆ తర్వాత 23, 24, 25 తేదీల్లో అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశానికి పరీక్షలు జరుపుతున్నారు. ఈసారి ఇంజనీరింగ్, అగ్రికల్చర్, బీ.ఫార్మసీ విభాగాల్లో మొత్తం 2,72 ,900 మంది విద్యార్థులు పరీక్షలకు దరఖాస్తు చేశారు. మొత్తం 47 పట్టణాల్లో 118 పరీక్ష కేంద్రాల ఏర్పాటు చేశారు.
ఎంసెట్‌కు నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతించేది లేదని ఇప్పటికే ఎంసెట్ నిర్వాహకులు ప్రకటించారు. నిర్ణీత సమయానికి రెండు గంటల ముందు నుంచే విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి విద్యార్ధులను అనుమతిస్తున్నారు. ప్రతి విద్యార్థి భౌతిక దూరం పాటించేలా పరీక్ష కేంద్రంలో ఏర్పాట్లు చేశారు. పరీక్ష హాలులో విద్యార్థికి, విద్యార్థి మధ్య నాలుగు నుంచి ఆరు అడుగులు భౌతిక దూరం ఉండేలా బల్లలు ఏర్పాటు చేశారు. పరీక్షకు ముందు, తరువాత పరీక్ష కేంద్రాలను పూర్తిస్థాయిలో శానిటైజన్ చేయించాలని ఎంసెట్ కన్వీనరు- పరీక్ష కేంద్రాల నిర్వాహకులను ఆదేశించారు. విద్యార్థులను థర్మల్ స్క్రీనింగ్, హ్యాండ్ శానిటైజేషన్ చేసిన తర్వాతే కేంద్రంలోకి అనుమతిస్తున్నారు. ప్రతి విద్యార్థి తప్పనిసరిగా మాస్కు ధరించేలా చూస్తున్నారు.
ఇదీ చదవండి:
ఇంద్రకీలాద్రిపై వివాదం... దేవాదాయశాఖ విచారణ ముమ్మరం