ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ధిక్కరణ కేసు'పై నేడు హై కోర్టులో విచారణ... హాజరు కానున్న డీజీపీ - డీజీపీ గౌతమ్ సవాంగ్ వార్తలు

పదోన్నతి విషయంలో హైకోర్టు ఆదేశాలు పట్టించుకోలేదని ఎస్సై యు.రామారావు దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్​పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్‌ విశ్వజిత్‌, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌, ఐజీ మహేశ్‌చంద్ర లడ్డా వ్యక్తిగతంగా కోర్టుకు హాజరై వివరణ ఇవ్వనున్నారు.

DGP Gowtham sawang
DGP Gowtham sawang

By

Published : Jan 27, 2021, 10:49 AM IST

కోర్టు ధిక్కరణ కేసులో రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్‌ విశ్వజిత్‌, హోం శాఖ సెక్రటరీ ఐజీ మహేశ్‌చంద్ర లడ్డా నేడు హైకోర్టులో హాజరు కానున్నారు. ఎస్సై యు.రామారావు దాఖలు చేసిన పిటిషన్​పై ఈ నెల 25న విచారణ జరిపిన న్యాయస్థానం...​ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌, ఐజీ మహేశ్ చంద్ర గైర్హాజరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

హాజరు కాలేకపోవడానికి డీజీపీ, ఐజీ పేర్కొన్న కారణాలు సంతృప్తికరంగా లేనప్పటికీ, వారి పోస్టులను పరిగణనలోకి తీసుకుని సోమవారం (జనవరి 25) నాటి విచారణకు హాజరు నుంచి మినహాయిస్తున్నట్లు పేర్కొన్నారు. తదుపరి విచారణ నేటికి వాయిదా వేసిన మేరకు.. ఇవాళ వాదనలు జరగనున్నాయి. కచ్చితంగా హాజరు కావాల్సిందే అని కోర్టు ఆదేశించిన మేరకు.. వీరు ముగ్గురూ నేడు న్యాయస్థానం ఎదుట హాజరుకానున్నారు.

ABOUT THE AUTHOR

...view details