ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలే' - dgp gowtham sawang comments on liquor shops

రాష్ట్రంలో మద్యం దుకాణాల వద్ద నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని డీజీపీ గౌతమ్​ సవాంగ్​ హెచ్చరించారు. మద్యం దుకాణాల వద్ద కొనుగోలుదారులు గుమికూడకుండా యజమానులు చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రశాంత వాతావరణానికి భంగం కల్పిస్తే జాతీయ విపత్తు చట్టం కింద కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.

'నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలే'
'నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలే'

By

Published : May 5, 2020, 10:01 PM IST

రాష్ట్రంలో నిబంధనలు ఉల్లంఘించే మద్యం కొనుగోలుదారులపై కఠినంగా వ్యవరిస్తామని డీజీపీ గౌతమ్‌సవాంగ్ హెచ్చరించారు. నిర్ణీత సమయంలోనే దుకాణాల వద్ద విక్రయాలు జరపాలన్న ఆయన.. మద్యం కొనుగోలుదారులు భౌతిక దూరం పాటించాలన్నారు. మద్యం దుకాణాల వద్ద గుమికూడకుండా ఉండాలని సూచించారు.

ప్రతి ఒక్కరూ విధిగా మాస్కులు ధరించాలని డీజీపీ చెప్పారు. ఆదేశాలు పాటించని దుకాణాలను తక్షణమే మూసేస్తామని స్పష్టం చేశారు. ప్రశాంత వాతావరణానికి భంగం కల్పిస్తే... జాతీయ విపత్తు చట్టం కింద కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వివాదాలు సృష్టించే వారిపై అనునిత్యం ప్రత్యేక నిఘా ఉంటుందని సవాంగ్​ చెప్పారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details