రాష్ట్రంలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వ్యక్తిగత వాహనాల్లో వెళ్లేందుకు ప్రత్యేక అనుమతులు అవసరం లేదని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. జిల్లాల సరిహద్దుల్లో వాహనాలు ఆపొద్దని ఇప్పటికే ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. ముగ్గురికి మించకుండా ప్రయాణించడం, మాస్కులు ధరించడం వంటి నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు.
రాష్ట్రంలో రాకపోకలకు అనుమతులు అవసరం లేదు: డీజీపీ - వాహన రాకపోకలపై ఏపీ డీజీపీ ప్రకటన వార్తలు
రాష్ట్రంలో వ్యక్తిగత వాహనాల్లో వెళ్లేందుకు ప్రత్యేక అనుమతులు అవసరం లేదని డీజీపీ గౌతం సవాంగ్ స్పష్టం చేశారు.
ap dgp Gautam Sawang