ముఖ్యమంత్రి జగన్‌తో డీజీపీ గౌతమ్ సవాంగ్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో శాంతి భద్రతల అంశంపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. రాజధాని ప్రాంత ప్రజలు నిన్న చేపట్టిన జాతీయ రహదారుల దిగ్బంధం ఉద్రిక్తంగా మారిన ఘటనను సవాంగ్... సీఎంకు వివరించారు. వైకాపా ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కారుపై దాడి, మరో ఎమ్మెల్యే కైలె అనిల్‌పై దాడికి సంబంధించి లభ్యమైన ఆధారాలు, పోలీసులు తీసుకున్న చర్యలను డీజీపీ......ముఖ్యమంత్రికి వివరించినట్లు తెలుస్తోంది. రాజధానిలో రైతులు ఆందోళన కొనసాగిస్తున్న పరిస్థితుల్లో శాంతి భద్రతల పరంగా తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి జగన్ పలు సూచనలు చేసినట్లు సమాచారం.
సీఎం జగన్‌తో డీజీపీ గౌతమ్ సవాంగ్ భేటీ
తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎంతో... డీజీపీ గౌతమ్ సవాంగ్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న శాంతి భద్రతల అంశంపై ముఖ్యమంత్రి జగన్‌తో... డీజీపీ చర్చించినట్లు సమాచారం. రాజధాని ప్రాంతంలో రైతుల ఆందోళనల నేపథ్యంలో శాంతి భద్రత పరంగా తీసుకోవాల్సిన చర్యలపై సీఎం పలు సూచనలు ఇచ్చినట్లు తెలుస్తోంది.
సీఎం జగన్ తో డీజీపీ గౌతమ్ సవాంగ్ భేటీ