ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

జిల్లా ఎస్పీల పర్యవేక్షణలో 'ఆపరేషన్ ముస్కాన్': డీజీపీ - AP DGP Gautam Sawang news

రాష్ట్రవ్యాప్తంగా ఐసీడీఎస్, చైల్డ్ వెల్పేర్ కమిటీల సమన్వయంతో...జిల్లా ఎస్పీల పర్యవేక్షణలో ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమం చేపట్టినట్లు డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు.

dgp gowtham sawang
డీజీపీ గౌతమ్ సవాంగ్

By

Published : Oct 28, 2020, 1:01 PM IST

రాష్ట్రవ్యాప్తంగా జిల్లా ఎస్పీల పర్యవేక్షణలో ఆపరేషన్‌ ముస్కాన్ చేపట్టినట్లు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు. దీని కోసం జిల్లా ఎస్పీలు ప్రత్యేక పోలీసు రెస్య్కూ బృందాలను ఏర్పాటు చేశారన్నారు. ఐసీడీఎస్‌, చైల్డ్ వెల్ఫేర్‌ కమిటీల సమన్వయంతో ఈ కార్యక్రమం చేపట్టామన్న డీజీపీ... రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, హోటళ్లు, పరిశ్రమలు, దుకాణాలు, రద్దీ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు వివరించారు.

హైదరాబాద్ కిడ్నాపర్లకు ఆపరేషన్ ముస్కాన్‌తో అనంతపురం పోలీసులు చెక్‌పెట్టారని.. దంత వైద్యుడిని కిడ్నాపర్ల చెర నుంచి కాపాడారని డీజీపీ స్పష్టం చేశారు. హైదరాబాద్ ఎక్సైజ్ కాలనీలో మంగళవారం సాయంత్రం హుస్సేన్‌ కిడ్నాప్‌ అయ్యానట్లు సవాంగ్ చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details