రాష్ట్ర వ్యాప్తంగా వీధిబాలలు, వివిధ ప్రాంతాల్లో కూలిపనులు చేస్తున్న చిన్నారులను పోలీస్‌శాఖ గుర్తించిందని డీజీపి గౌతం సవాంగ్ స్పష్టం చేశారు. ఇప్పటి వరకు మొత్తం 25 వేల 298 మంది చిన్నారులను గుర్తించామని తెలిపారు. ఆపరేషన్ ముస్కాన్ ద్వారా మంచి ఫలితాలు వచ్చాయని అన్నారు. జనవరి, జులై, అక్టోబర్ నెలలో ఆపరేషన్స్ నిర్వహించామన్న డీజీపీ.. 7 రోజుల్లో 16 వేల 457 మంది పిల్లలను రెస్క్యూ చేశామని వివరించారు.
ఆపరేషన్ ముస్కాన్ ద్వారా 25,298 మంది చిన్నారులు గుర్తింపు: డీజీపీ - ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ తాజా వార్తలు
ఆపరేషన్ ముస్కాన్ ద్వారా మంచి ఫలితాలు వచ్చాయని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. ఇప్పటివరకు మొత్తం 25 వేల 298 మంది చిన్నారులను గుర్తించామని అన్నారు. 7 రోజుల్లో 16 వేల 457 మంది పిల్లలను రెస్క్యూ చేశామని వివరించారు. పేదరికం కారణం 70 శాతం మంది చిన్నారులు ఇళ్లు వదిలి బయట పని చేస్తున్నారని తెలిపారు.
![ఆపరేషన్ ముస్కాన్ ద్వారా 25,298 మంది చిన్నారులు గుర్తింపు: డీజీపీ ap dgp comments](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9428384-652-9428384-1604484986719.jpg)
చిన్న పిల్లల చేత.. పని చేయించుకోవడం చట్టరీత్యా నేరమని గౌతం సవాంగ్ గుర్తు చేశారు. పిల్లలు చదువుకునేందుకు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు నిర్వహిస్తోందన్నారు. చిన్నపిల్లల భవిష్యత్ సమాజానికి అవసరమన్నారు. చిన్నారులను రెస్క్యూ చేసి వదిలేయడమే కాకుండా.. వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇస్తున్నట్లు తెలిపారు. పేదరికం కారణం 70 శాతం, తల్లిదండ్రులు పట్డించుకోకపోవడం వల్ల 9 శాతం, వివిధ కారణాలతో 21 శాతం మంది చిన్నారులు ఇళ్ళు వదిలి వచ్చి బయట జీవిస్తున్నట్లు గుర్తించామన్నారు.
ఇదీ చదవండి:ఏలూరులో రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులకు సీఎం శంకుస్థాపన