Conference Of Secretaries at Amaravati: ఈ నెల 8 తేదీన అమరావతి సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ అధ్యక్షతన కార్యదర్శుల కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన పది అంశాలపై సీఎస్ సమీక్షించనున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల నుంచి నిధులను రాబట్టే అంశంపై చర్చించనున్నారు.
Conference Of Secretaries at Amaravati: ఈ నెల 8న సీఎస్ అధ్యక్షతన కార్యదర్శుల భేటీ - central govt schemes
Conference Of Secretaries at Amaravati: ఈనెల 8న సీఎస్ సమీర్ శర్మ అధ్యక్షతన కార్యదర్శుల కాన్ఫరెన్స్ జరగనుంది. ఇందులో ప్రధానంగా ప్రభుత్వం నిర్దేశించిన 10 అంశాలతో పాటు కేంద్ర నిధుల రాబట్టడంపై చర్చిస్తారు. వీటితో పాటు కోర్టు కేసులు, ఉద్యోగుల హాజరు, ఈ- ఆఫీసు అమలుపై సమీక్షిస్తారు.
AP CS Sameer Sharma Review on Centre Schemes: కేంద్రం నుంచి మరిన్ని నిధులను తెచ్చుకునేలా వివిధ పథకాలకు కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేసే అంశంపై ఉన్నతాధికారులు కసరత్తు చేయనున్నారు. ప్రభుత్వంపై ఉన్న కోర్టు కేసులు.. కౌంటర్ల దాఖలు.. కోర్టు తీర్పుల అమలుపై సీఎస్ కీలక సమీక్ష చేపట్టనున్నారు. ఉద్యోగుల హాజరు, ఈ-ఆఫీస్ అమలుపై సమీక్షిస్తారు. వివిధ శాఖలకు చెందిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనపై ప్రణాళిక శాఖ నివేదికపై కార్యదర్శుల సమావేశంలో చర్చించనున్నారు.
ఇదీ చదవండి:Chandrababu slams on YSRCP: "జగన్ నవరత్నాలను నమ్మి.. జనం నవగ్రహాల చుట్టూ తిరుగుతున్నారు"