రాష్ట్రంలో ధాన్యం సేకరణను వేగవంతం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ అధికారులను ఆదేశించారు. సచివాలయంలో సంబంధిత శాఖల అధికారులతో ధాన్యం కొనుగోలుపై సీఎస్ సమీక్షించారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ చేపట్టాలని ఆదేశించారు. కొనుగోలు చేసిన ధాన్యానికి రైతులకు సకాలంలో సొమ్ము చెల్లించాలని సూచించారు. వచ్చే సీజన్లో ధాన్యం సేకరణ మరింత సులువుగా జరిగేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. మరోవైపు జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష అంశంపైనా సీఎస్ జిల్లా కలెక్టర్లతో మాట్లాడారు. ఈ కార్యక్రమాన్ని మరింత పారదర్శకంగా సమర్థవంతంగా నిర్వహించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సీఎస్ సమీర్ శర్మ కలెక్టర్లను ఆదేశించారు.
ధాన్యం సేకరణ వేగవంతం చేయాలి: సీఎస్
ఆర్‌బీకేలను కేంద్రంగా చేసుకుని ధాన్యం సేకరణ మరింత వేగవంతం చేయాలని సీఎస్ సమీర్‌శర్మ ఆదేశించారు. కొనుగోలు చేసిన ధాన్యానికి రైతులకు సకాలంలో సొమ్ము చెల్లించాలని సూచించారు. రానున్న రోజుల్లో సేకరణ ప్రక్రియ సులువుగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ధాన్యం సేకరణపై సంబంధిత శాఖల అధికారులతో సచివాలయంలో సమీక్ష నిర్వహించారు.
ap cs sameer sharma