సచివాలయాల వ్యవస్థను పటిష్టం చేయాలి:సీఎస్ సాహ్ని - గ్రామ సచివాలయాలపై సీఎస్ సమీక్ష వార్తలు
గ్రామ, వార్డు సచివాలయాలపై సీఎస్ నీలం సాహ్ని సమీక్షించారు. ఈ రెండు వ్యవస్థలు మరింత పటిష్టంగా పని చేసేలా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు.
సచివాలయాల వ్యవస్థను మరింత పటిష్టంగా పనిచేసేలా తీర్చిద్దాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఆదేశించారు. గ్రామ,వార్డు సచివాలయాల్లో వివిధ శాఖలకు సంబంధించి నియమితులైన సిబ్బంది.. వారికి కేటాయించిన విధులను సక్రమంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. జాబ్ చార్ట్,విధులు తదితర అంశాలకు సంబంధించి వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో... పంచాయితీరాజ్,మున్సిపల్ శాఖల అధికారులు చర్చించి పరిష్కరించుకోవాలని ఆమె సూచించారు. ఈ రెండు వ్యవస్థలు ద్వారా సుమారు 28 విభాగాలకు సంబంధించి 541 వివిధ రకాల సర్వీసులను ప్రజలకు అందిస్తున్నట్టు ప్రత్యేక అధికారి కన్నబాబు స్పష్టం చేశారు.
ఇదీ చదవండి :
'మలేసియాలో ఉద్యోగం అని తీసుకెళ్లారు... చిత్రహింసలకు గురి చేశారు'
TAGGED:
సీఎస్ సాహ్ని సమీక్ష వార్తలు