రాష్ట్రంలో ఆసుపత్రి ప్రసవాలను పెంచేందుకు క్షేత్రస్థాయి ఆరోగ్య సిబ్బంది కృషి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఆదేశించారు. సచివాలయంలో వైద్యారోగ్య శాఖపై సీఎస్ సమీక్షించారు. మాతాశిశు మరణాల సంఖ్యను కనిష్ట స్థాయికి తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. గర్భిణీల్లో రక్తహీనతను తగ్గించేలా పౌష్టికాహారాన్ని అందించాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయిలో మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఆదేశించారు. ఆయా మండలాల్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న అంబులెన్సుల సంఖ్యపై.... సాహ్నీ ఆరా తీశారు. ఆయా ప్రాంతాల్లో వైద్య సేవలు, సదుపాయాల గురించి సీఎస్ కు అధికారులు వివరించారు.
మాతాశిశు మరణాలను తగ్గించేందుకు కృషి చేయండి:సీఎస్ - సీఎస్ సాహ్ని సమీక్ష వార్తలు
సచివాలయంలో వైద్యారోగ్య శాఖపై సీఎస్ సమీక్షించారు. రాష్ట్రంలో ఆసుపత్రి ప్రసవాలను పెంచేందుకు క్షేత్రస్థాయి ఆరోగ్య సిబ్బంది కృషి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఆదేశించారు.
cs-review-on-health-and-medical