మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మార్చి 10వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా 12 మున్సిపల్ కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల పరిధిలో సెలవు ప్రకటించాల్సిందిగా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ జారీ చేశారు. మరోవైపు పోలింగ్‌తో పాటు 14 కౌంటింగ్ జరగనున్న దృష్ట్యా ప్రభుత్వ భవనాలు, పాఠశాల భవనాలను వినియోగించుకునేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలని సీఎస్ స్పష్టం చేశారు. ఆయా రోజుల్లో సదరు ప్రభుత్వ కార్యాలయాలకు కూడా సెలవు ప్రకటించాలని సూచిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.
మార్చి 10వ తేదీన సెలవు ప్రకటించండి.. కలెక్టర్లకు సీఎస్ ఆదేశం
మార్చి 10వ తేదీన మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో సెలవు దినంగా ప్రకటించాలంటూ కలెక్టర్లను సీఎస్ ఆదేశించారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు.
ఏపీ సీఎస్