ప్రభుత్వ కార్యాలయాలకు రంగుల అంశంపై గురువారం హైకోర్టులో విచారణ జరగనుంది. విచారణలో భాగంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని కోర్టుకు హాజరకానున్నారు. పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి జి.కె.ద్వివేది, పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజాశంకర్.. సీఎస్ వెంట వెళ్లనున్నారు.
జీవో నెం. 623 జారీని కోర్టు ధిక్కరణ కింద ఎందుకు పరిగణించకూడదో వివరణ ఇవ్వాలని అధికారులను కోర్టు గత విచారణలో ఆదేశించింది. సీఎస్ నేరుగా హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. జీవో జారీపై కోర్టు ధిక్కరణ ప్రోసీడింగ్స్‌ను ప్రారంభించాలని హైకోర్టు రిజిస్ట్రార్‌కు ఆదేశాలిచ్చింది.